రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. ఇటీవల పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అయిదోసారి ఎన్నికవడంతో మంత్రిమండలి లాంఛనప్రాయంగా రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో మిషుస్తిన్కు పుతిన్ తిరిగి ప్రధాని పీఠాన్ని అప్పగించారు. ఆయన కేబినెట్లో ఇటీవలి వరకు కొనసాగినవారిలో చాలామంది తిరిగి పాత విధుల్లో యథాతథంగా చేరే అవకాశాలు ఉన్నాయి. రక్షణ మంత్రి సెర్గీ షొయిగు భవితవ్యంపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి.






