Vietnam: ట్రంప్ దారికొచ్చిన వియత్నాం, తైవాన్?

అమెరికా భారీగా విధించిన సుంకాల దెబ్బకు వియత్నాం (Vietnam), తైవాన్(Taiwan) దారికొచ్చినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు అమెరికా వస్తువులపై సున్నా సుంకాలను ప్రతిపాదించినట్లు సమాచారం. ఇటీవల వియత్నాంపై అమెరికా 46 శాతం సుంకాలను విధించింది. దీంతో ఆ దేశాధినేత టూ లామ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ ఫోన్‌కాల్ చర్చ ల్లో పురోగతి సాధించినట్లు వెల్లడిరచారు. అమెరికాతో తాము ఓ ఒప్పందం చేసుకోగలిగితే ఆ దేశ వస్తువులపై సుంకాలను సున్నా చేస్తామని చెప్పారు.
మరోవైపు ద్వీప దేశమైన తైవాన్ వియత్నాం బాటలోనే ప్రయాణించాలని నిర్ణయించింది. తైవాన్‌పై అమెరికా 32 శాతం సుంకాలను విధించింది. దీంతో ఆ దేశాధ్యక్షుడు లాయ్ చింగ్ తె (Lai Ching The) కీలక సమావేశం నిర్వహించి, అమెరికాతో వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని నిర్ణయించారు. తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంపీ (TSMP) సంస్థ అమెరికాలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.