US Aid: ఎక్కడో పొరపాటు జరిగింది… యూఎస్ ఎయిడ్‌పై యూటర్న్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. వృథా ఖర్చులను తగ్గించుకోవడం కోసమంటూ యూఎస్ ఎయిడ్ (US Aid) ను నిలిపివేసి, మళ్లీ ఇప్పుడు దానిని పునరుద్ధరిస్తున్నారు. ఇటీవల 14 దేశాలకు ఆహార సహాయాన్ని నిలిపివేసిన అగ్రరాజ్యం, పొరపాటున అలా జరిగిందని పేరొంది. ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్‌పీ) (WFP ) సంబంధించిన మానవతా సహాయ ఒప్పందాలను పునరుద్ధరించిందని మీడియా (Media) వెల్లడించింది. అయితే ఏఏ దేశాల్లోకి వెళ్తున్న సహాయం విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.