America :విదేశీ విద్యార్థులపై అమెరికా ఏఐ నిఘా

విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో హమాస్ అనుకూల ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను గుర్తించడానికి, అమెరికా(America) ప్రభుత్వం ఏఐ సాంకేతికత (AI technology )ను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఉగ్రవాద అనుకూల పోస్టులు, కథనాలకు ఇన్‌స్టా (Insta) లో లైక్ కొట్టినా దొరకబుచ్చుకునేలా ట్రంప్ యంత్రాంగం ఈ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సమాచారం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) నాయకత్వంలో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికా రులు పేర్కొన్నారు. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ (Israel) పై హమాస్ దాడి చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ వారికి మద్దతుగా ఎవరెవరు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు చేశారు. ఎవరు వాటిపై లైక్ షేర్ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను స్కాన్ చేస్తున్నట్లు యాక్సియోస్ అనే నివేదిక వెల్లడిరచింది. నివేదికలోని వివరాల ప్రకారం విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై కొంతకాలంగా ఏఐ నిఘా కొనసాగుతోంది. విద్యార్థులు వారు చేసిన పోస్టులను తొలగించినప్పటికీ ప్రభుత్వ విభాగాల వద్ద వాటి స్క్రీన్‌షాట్‌లు ఉంటాయి.