భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా ఆంక్షలు

భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై అమెరికా విధించిన నిషేధం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ ఇది వర్తిస్తుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు, విద్యావేత్తలు, పాత్రికేయులకు నిషేధం నుంచి మినహాయింపునిచ్చారు. అమెరికన్లు సహా గ్రీన్ కార్డులు కలిగినవారు, వారి జీవిత భాగస్వాములు (వయోవృద్ధులు కానివారు), 21 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారి పిల్లలు మినహాయింపు జాబితాలో ఉన్నారు.