Panama Canal :ఆ కాలువ… అమెరికా ఇచ్చిన గిఫ్ట్ కాదు : ములినో
పనామా కాలువ తమదేనంటూ గత కొన్ని రోజులుగా వ్యాఖ్యానిస్తున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇటీవల తన ప్రమాణస్వీకారం సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఆ కాలువను తప్పకుండా వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు. దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో (Jose Raul Mulino) తీవ్రంగా స్పందించారు. ఈ కాలువను అమెరికా తమకేం బహుమతిగా ఇవ్వలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్(Switzerland)లోని దావోస్ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ములినో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అదంతా అవాస్తవం. ఆ కాలువ అమెరికా నుంచి మాకు రాయితీగానో, బహుమతిగానో వచ్చింది కాదు. అది మాది. మాకు మాత్రమే సొంతం అని తెలిపారు.






