Houthi: హూతీల దాడిని తిప్పికొట్టిన అమెరికా
యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు మరోసారి అమెరికా(America) వాణిజ్య నౌకలపై దాడికి యత్నించారు. అయితే వారు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ (Missiles, drone) లను అమెరికా నావికాదళం కూల్చివేసింది. అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో ప్రయాణిస్తున్న మూడు అమెరికా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని హూతీలు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారు. రక్షణగా వెళ్తున్న యుద్ధనౌక సత్వరం స్పందించి ఆ దాడులనను తిప్పికొట్టింది. మూడు నౌక విధ్వంసక బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, ఓ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణిని ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. హూతీ (houthi) తిరుగుబాటు దార్లు దాడికి ఎంచుకున్న అమెరికా వాణిజ్య నౌకల వివరాలను మాత్రం వెల్లడించలేదు.






