India : భారత్, చైనాను చావుదెబ్బ కొట్టిన అమెరికా – రష్యాపై కోపంతో
భారత్, చైనా దేశాలకు చౌకగా చమురును అందిస్తున్న రష్యా క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. డొనాల్ట్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే భారత్ (india), చైనా(China )లకు వ్యతిరేకంగా అమెరికా పెద్ద నిర్ణయం తీసుకుంది. రష్యా చమురు ఉత్పత్తి సంస్థలైన గాజ్ ప్రోమ్ నెఫ్ట్, సర్గట్నెప్టెగాస్ అలాగే రష్యా చమురును తీసుకువెళుతున్న 183 నౌకలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి వినియోగించే ఆదాయాన్ని తగ్గించడమే ఈ ఆంక్షల లభ్యమని భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనల కారణంగా చైనా, భారతదేశం ఇప్పుడు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికా నుండి మరింత చమురును కొనుగోలు చేస్తాయి. ధరలు, సరుకు రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే రష్యా ఉత్పత్తి సంస్థలు, నౌకలపై అమెరికా కొత్త ఆంక్షలు కస్టమర్లకు సరఫరాలను తగ్గిస్తాయి.






