US visa : 2000 అమెరికా వీసా అపాయింట్‌మెంట్ల రద్దు

భారత్‌లో 2,000 వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం (Embassy) ప్రకటించింది. బాట్స్ (Bots) సాయంతో మోసపూరితంగా ఈ అపాయింట్‌మెంట్లను ఏజెంట్లు బ్లాక్ చేసి విక్రయించడమే కారణమని పేర్కొంది. బాట్స్ ద్వారా అక్రమంగా తీసుకున్న 2,000 వీసా అపాయింట్‌మెంట్ల ను భారత్‌లోని కాన్సులర్ బృందం (Consular team) రద్దు చేస్తోంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్లను ఏమాత్రం సహించం. ఈ అపాయింట్‌మెంట్లను రద్దు చేయడంతోపాటు అనుబంధ ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారులను సస్పెండ్ చేస్తున్నాం. మోసాలను నిర్మూలనకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి అని పేర్కొంది. ప్రస్తుతం బీ1, బీ2, స్టూడెంట్ వీసాల అపాయింట్‌మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. కానీ ఏజెంట్ల (Agents) కు డబ్బులు చెల్లిస్తే కేవలం నెల రోజుల్లోనే అపాయింట్‌మెంట్లు దొరుకుతున్నాయి.