Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్
తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్
సంగీతం : సామ్ సిఎస్, సినిమాటోగ్రఫీ : చిన్మయ్ సలాస్కర్
ఎడిటర్ : నిరంజన్ దేవరమానే, ప్రొడక్షన్ డిజైన్ : మనీషా ఎ దత్
ఆర్ట్ డైరెక్టర్ : డి శివ కామేష్, స్టంట్స్ : రామ్ క్రిషన్, నటరాజ్, జాషువా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : టి సందీప్, సమర్పణ : శ్రీమతి. అర్చన
నిర్మాత : సాహు గారపాటి
రచన & దర్శకత్వం : కౌశిక్ పెగల్లపాటి
విడుదల తేది : 12.09.2025
నిడివి : 2 ఘంటల 05 నిముషాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ కథలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే కొంతమంది దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం డిజాస్టర్ లను అందిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అప్ కమింగ్ హారర్-మిస్టరీ థ్రిల్లర్ కిష్కిందపురిలో బోల్డ్, ఇంటెన్స్ పాత్రలో ‘కిష్కిందపురి’ (Kishkindhapuri ) చిత్రం లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఈనెల 12 వ తేదీన రిలీజ్ అవుతున్నప్పటికి నిన్న నైట్ ఈ సినిమాకి ప్రీమియర్ షోలైతే వేశారు… మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి సమీక్ష లో తెలుసుకుందాం.
కథ :
‘కిష్కింధపురి’ ఓ రేడియో స్టేషన్‌లో జరిగిన కథ. 1989 నాటి కథ. దెయ్యాల స్టోరీలు తెలుసుకోవడానికి దెయ్యాల మీద ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది రాఘవ అండ్ టీం కలిసి ఒక ప్లేస్ కి అయితే వెళ్తారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి దెయ్యాలు తిరిగే ఏరియా అని చెప్పి సువర్ణభూమి రేడియో స్టేషన్ అనే ప్లేస్ కైతే వెళ్లాల్సి వస్తుంది. సువర్ణమాయలో విశ్వరపుత్ర (శాండీ మాస్టర్) సృష్టించిన భయానక విధ్వంసమే ‘కిష్కింధపురి’. ప్రేతాత్మ దాని పరిచయం అనే కాన్సెప్ట్‌లో దెయ్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్లందర్నీ.. ఓ దెయ్యాల కొంపకి తీసుకుని వెళ్లి ఆ దెయ్యం వెనుకున్న కథని పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయించడమే పనిగా ‘ఘోస్ట్ వాకింగ్ టూర్’ని నిర్వహిస్తుంటారు రాఘవ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ). అలా ఓ 11 మంది బృందాన్ని అనుకోకుండా.. కిస్కిధపురి ఊరిలో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌కి తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్లిన తరువాత.. ఆ బృందంలోకి ఒక్కొక్కర్నీ వేదవతి (రేడియో ఆర్టిస్ట్) అనే దెయ్యం చంపేస్తూ ఉంటుంది. ఆ దెయ్యానికి ఎదురెళ్లిన రాఘవ.. మిగిలిన వాళ్లని ఎలా కాపాడాడు? ‘సువర్ణమాయ’లో అసలేం జరిగింది? సువర్ణమాయలో ఉన్న రాక్షసశక్తి విశ్వరపుత్రని రాఘవ ఎలా ఢీ కొట్టాడు? అసలు అతని కథ ఏంటి అనేదే ‘కిష్కింధపురి’.
నటీ నటుల హవబవాలు :
ఇక ఆర్టీస్స్ పర్ఫామెన్స్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చేయనటువంటి గొప్ప నటనను ప్రదర్శించే ప్రయత్న అయితే చేశాడు బెల్లంకొండ సినిమా అంటే ఎలా ఉంటుందో అన్న ఆసక్తికంటే.. ఏమీ ఉండదులే అనే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ. అలాగని అతని నుంచి వచ్చినవన్నీ చెత్త సినిమాలే అనుకుంటే.. గొప్ప కథలు చేయకపోవచ్చు కానీ.. చెత్త కథలైతే చేయలేదు. రాక్షసుడు, జయ జానకి నాయక, అల్లుడు శీను, ఛత్రపతి, వంటి మంచి చిత్రాలున్నా కూడా తన సినిమాలకే తానే పెద్ద మైనస్ అనే ముద్ర అయితే పడింది. కానీ ‘కిష్కింధపురి’ వంటి చిత్రంతో తాను రొటీన్ కమర్షియల్ హీరోని కాదని చెప్పే ప్రయత్నం చేశాడు బెల్లంకొండ. కిష్కింధపురితో భయపెట్టాడు. థ్రిల్‌కి గురి చేశాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ సైతం కొన్ని మేజర్ సన్నివేశాల్లో చాలా గొప్ప పర్ఫామెన్స్ ని ఇచ్చింది. ఆమె పర్ఫామెన్స్ వల్ల కూడా సినిమా మీద భారీ హైప్ అయితే పెరిగింది. హైపర్ ఆది కామెడీ పంచులు అక్కడక్కడ ఓకే అనిపించాయి. ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతికవర్గం పనితీరు :
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ మూవీ కి మ్యూజిక్ అందించిన చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. హారర్ చిత్రాలను నిలబెట్టేవి విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్. సినిమాటోగ్రఫీ, చైతన భరద్వాజ్ సౌండ్ ఎఫెక్ట్స్.. దర్శకుడి ఊహని కళ్లకి కట్టినట్టే అనిపిస్తాయి. సువర్ణమాయ రేడియో సెట్ రియల్ ఎక్స్‌పీరియన్స్‌ని కలిగిస్తే.. చైతన భరద్వాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా చోట్ల భయపెడతాయి. సినిమా నిడివి రెండుగంటలే కావడంతో బోరింగ్ లేకుండా ఎడిట్ చేశారు నిరంజన్ దేవరమనే. ఇక విజువల్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఇక విజువల్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా డీసెంట్ విజువల్స్ ని అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగట్టుగా రిచ్ గా వున్నాయి.
విశ్లేషణ :
రామాయణం స్పూర్తితో డివోషనల్ టచ్ ఇస్తూ ఈ హారర్ కథ మొదలౌతుంది. రాముడి గుడిలో వానర సైన్యం ఫైట్‌తో ‘కిష్కింధపురి’ డీ కోడ్ చేసుకున్న వారికి రామాయణంలో చాలా రిఫరెన్స్ దొరుకుతాయి. దుష్టశక్తుల్ని ఎదురించడానికి హీరో చేతికి ఉన్న జై శ్రీరామ్ అనే కడియం కూడా రామాయణ స్పూర్తిలో భాగమే. ఈ మధ్యకాలంలో జై శ్రీరామ్ అనే కాన్సెప్ట్ సినిమాల్లో బాగా వర్కౌట్ అవుతుండటంతో.. ఈ హారర్ చిత్రంలో కూడా భక్తి భావాన్ని రంగరించారు. దర్శకుడు ఎక్కడ కూడా డివియెట్ అవ్వకుండా చాలా ఫ్రెష్ ఫీల్ తో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ దర్శకుడు ఈ సినిమాతో మరోసారి తన ఖాతాలో సక్సెస్ ను వేసుకున్నాడనే చెప్పాలి.
సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతోంది. అక్కడి నుంచి సినిమా మొత్తాన్ని ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఇక రైటింగ్ విషయంలో కూడా ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నాడు. హార్రర్ గొలిపే సన్నివేశాలు చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంగేజింగ్ గా వెళ్తే బాగుండు అనుకున్నప్పటికి అక్కడక్కడ కొంతవరకు తడబడ్డాడు. సెకండాఫ్ మీద దర్శకుడు ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటే బాగుండేది. అది రొటీన్ గానే ఉండడంతో ప్రేక్షకులు దానిని కొంతవరకు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ప్రతి సీన్ ను డైరెక్టర్ చాలా డిఫరెంట్ గాప్రజెంట్ అయితే చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సైతం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చాడు. మొత్తానికైతే ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానం అయితే బాగుంది.