భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు : అమెరికా
భారత దేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. తాము ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తలదూర్చబోమని తెలిపింది. భారత్ ఎన్నికల్లో అక్కడి ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖారోవా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్లో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను భగ్నం చేసేందుకు, రాజకీయ అస్థిరత సృష్టించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని అన్నారు.






