Panama Canal: పనామా కాలువను కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం : అమెరికా

పనామా కాలువ (Panama Canal )ను కచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) మరోసారి స్పష్టం చేశారు. దానిపై చైనా ప్రభావం లేకుండా చేస్తామని తెలిపారు. పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో (Jose Raul Mulino ) తో హెగ్సెత్ రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మేం ఇద్దరం కలిసి (పనామా-అమెరికా) పనామా కాలువపై చైనా (China) ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటాం. చైనా ఈ కాలువను నిర్మించలేదు. ఆపరేట్ చేయదు. పనామా నాయకత్వలో దీన్ని సురక్షితంగా అన్ని దేశాలకు అందుబాటులో ఉంచుతాం అని హెగ్సెత్ పేర్కొన్నారు.