భారత్ ప్రభావం.. అమెరికాపైనే ఎక్కువ

కరోనాతో భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుందని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేస్తోంది. ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‍లో నెలకొన్న పరిస్థితుల ప్రతికూల ప్రభావం అమెరికా సహా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పలు అమెరికన్ కంపెనీలు లక్షల మంది భారతీయులను ఉద్యోగులుగా నియమించుకొని, బ్యాక్ ఆఫీసులు నడిపిస్తున్న నేపథ్యంలో అమెరికాపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని పేర్కొంది.