ఉక్రెయిన్‌కు మరో ఎదురుదెబ్బ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్ యార్ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి. దీంతో చాసివ్ యార్ను మాస్కో సేనలు ఆక్రమించడం ఇక లాంఛనప్రాయమే అనిపిస్తోంది. రష్యా నిరుడు ఆక్రమించిన బఖ్ముత్ నగరానికి పశ్చిమాన ఈ పట్టణం ఉంది. దాన్ని పుతిన్ సేనలు ఆక్రమిస్తే, చుట్టుపక్కల నగరాల భద్రత ప్రమాదంలో పడినట్లే. డొనెట్స్క్ ప్రాంతమంటినీ తన వశం చేసుకోవాలన్న లక్ష్యానికి రష్యా చేరువయ్యేందుకు మార్గం సుగమవుతుంది కూడా. చాసివ్ యార్ శివార్లలోని నజార్ వొలొశిన్ పట్టణం నుంచి తాజాగా తమ బలగాలు వెనక్కి మళ్లిన సంగతి ఉక్రెయిన్ సైన్యం స్వయంగా వెల్లడిరచింది. నెల రోజులగా అక్కడ రష్యా బలగాలు భీకరదాడులు చేస్తున్నాయని, తమ రక్షణ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాయని తెలిపింది. యుద్ధం ప్రారంభానికి ముందు చాసివ్ యార్‌లో 12 వేల వరకు జనాభా ఉండేదని, ప్రస్తుతం అది ఎడారిని తలపిస్తోందని పేర్కొంది.






