బ్రిటన్ ఎన్నికల్లో భారతీయం.. రికార్డు స్థాయిలో 28 మంది
యూకే సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 28 మంది భారత సంతతి వ్యక్తులు ఎంపీలుగా గెలిచారు. కన్జర్వేటివ్ పార్టీ తరపున తమ సీట్లను తిరిగి నిలబెట్టుకొన్న వాళ్లలో ప్రీతి పటేల్, సుయేలా బ్రేవర్మన్, గగన్ మోహింద్రా, శివానీ రాజా తదితరులు ఉన్నారు. లేబర్ పార్టీ నుంచి అధిక సంఖ్యలో భారత సంతతి వ్యక్తులు గెలిచారు. ఈ జాబితాలో సీమా మల్హోత్రా, ప్రీత్ కౌర్ గిల్, తన్మజీత్ సింగ్ తదితరులు ఉన్నారు. జాస్ అథ్వాల్, బగ్గీ శంకర్, సత్వీర్ కౌర్, కనిష్క నారాయణ్ తదితరులు తొలిసారిగా ఎంపీలుగా ఎన్నికయ్యారు.
యూకే ఎన్నికల బరిలో దిగిన ఇద్దరు తెలుగు వ్యక్తులు ఓడిపోయారు. లేబర్ పార్టీ తరపున నార్త్ బెడ్ఫోర్డ్ షైర్ నుంచి పోటీ చేసిన రచయిత ఉదయ్ నాగరాజు దాదాపు 5 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ తరపున స్టోక్ ఆన్ ట్రెండ్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన మరో తెలుగు వ్యక్తి చంద్ర కన్నెగంటి దాదాపు 6 వేల ఓట్లు మాత్రమే దక్కించుకొని మూడో స్థానానికి పరిమితమయ్యారు.






