Donald Trump : డొనాల్డ్ ట్రంప్ సుంకాలు.. ఇండియా ఐటీ రంగంపై ప్రభావం
అమెరికాకు భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తులపై 50శాతం సుంకాలను ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు దృష్టి ఇప్పుడు సమాచార సాంకేతిక(ఐటీ) రంగం, ఐటీఈఎస్(ITES) , రిమోట్ వర్కర్లు, ప్రవాస భారతీయులు పంపే రెమిటెన్స్‌పై పడిందా? ఆయా సేవలపైనా సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నారా? దీని వల్ల భారత దేశీయోత్పత్తి(జీడీపీ)లో అత్యంత కీలకమైన ఐటీ (IT), సేవా రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిస్థితులు అవుననే చెబుతున్నాయి.
అన్ని ఔట్‌సోర్సింగ్‌లపై సుంకం విధించాలి. విదేశాల నుంచి అమెరికాలోని కంపెనీలకు రిమోట్ సర్వీసుల(ఉద్యోగులు)పైనా ప్రివిలేజ్ కోసం సుంకాలు వేయాలి. ఇది కార్యరూపం దాలిస్తే ఐటీతోపాటు, ఐటీ ఆధారిత సేవారంగం(ఐటీఈఎస్), బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్(బీపీవో) ద్వారా విదేశాల నుంచి రిమోట్‌గా పనిచేసే వర్కర్లు/ఉద్యోగులు, అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీల్లో పనిచేసే హెచ్-1బీ వీసాదారులు, భారత్ (India) కు రెమిటెన్స్ పంపే ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది.