Flash flood: తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు!
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్(Flash flood) ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్ (Adilabad), నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్ (Medak), మేడ్చల్, మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలకు వరద ముప్పు ఉన్నట్లు పేర్కొంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.







