South Central Railway: 127 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
మొంథా తుపాను, వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్‌నుమా (Falaknuma,), ఈస్ట్‌కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేశారు. వర్షాల కారణంగా పలు రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (Konark Express), డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (Golconda Express) నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్ఎస్ నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు స్టేషన్లలో 12 గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి.







