Indian Origin Woman: కెనడాలో భారత సంతతి యువతి దారుణ హత్య
కెనడాలోని ఒంటారియోలో భారతీయ సంతతికి చెందిన ఓ యువతి (Indian Origin Woman) దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పంజాబ్‌కు చెందిన అమన్ ప్రీత్ సైనీ (27) అనే యువతి కొద్దికాలంగా టొరంటోలో నివసిస్తున్నారు. అక్టోబర్ 21న ఒంటారియోలోని లింకన్ ప్రాంతంలో ఉన్న చార్లెస్ డేలీ పార్క్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి, ఇది హత్యేనని ధ్రువీకరించారు. భారత్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ (Manpreet Singh) అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అమన్‌ప్రీత్ మృతదేహం దొరికిన కొద్దిసేపటికే నిందితుడు కెనడా నుంచి పారిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి, పోలీసులు.. అతని (Manpreet Singh) ఫోటోను విడుదల చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హృదయ విదారక సంఘటనపై కెనడాలో, అలాగే భారతదేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.







