నైజీరియా తీసుకున్న నిర్ణయంపై… డొనాల్డ్ ట్రంప్ హర్షం

ట్విట్టర్‍ను బ్యాన్ చేస్తూ నైజీరియా తీసుకున్న నిర్ణయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ట్విట్టర్‍ను బ్యాన్ చేయాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఫేస్‍బుక్, ట్విట్టర్‍లు వాక్‍స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. తాను అధ్యక్షుడుగా ఉన్నప్పుడే ఈ రెండు సోషల్ మీడియా సంస్థలను బ్యాన్ చేసి ఉండాల్సిందని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా నైజీరియాకు ట్రంప్ అభినందనలు తెలిపారు. ఆ దేశం ట్విట్టర్‍ను బ్యాన్ చేస్తూ గొప్ప నిర్ణయం తీసుకుంది అని అన్నారు. ట్విట్టర్, ఫేస్‍బుక్‍లను మరిన్ని దేశాలు బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. వాళ్లకు వాళ్లు ఏమైనా నియంతలు అనుకుంటున్నారా? కానీ జూకర్‍బర్గ్ నన్ను కలిసి వైట్ హౌస్ విందుకు వస్తానని అన్నారు. బహుశా అది 2024 వర్తిస్తుందేమో అని అన్నారు.