Preeti Saran: ఐరాస హక్కుల కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సరన్

ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్‌పర్సన్ గా భారత్‌కు చెందిన మాజీ దౌత్యాధికారిణి ప్రీతి సరన్ (Preeti Saran) నియమితులయ్యారు. జెనీవా (Geneva) కేంద్రంగా ఉన్న ఈ కేంద్రం ఆర్థిక, సామాజిక హక్కుల విషయమై సభ్య దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షిస్తుంది. ఇది ఐక్యరాజ్యసమితి (United Nations) మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల వ్యాప్తికి భారత్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ ఉన్నత పదవి ఇచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది.