Donald Trump: చంద్ర నాగమల్లయ్య హత్యపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

అక్రమ వలసలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. డాలస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్య (Chandra Nagamallaiah) ను క్యూబా (Cuba) వలసదారుడు హత్య చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికా (America) ను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని వెల్లడిరచారు. ఇకపై అక్రమ వలసదారులపై మెతకవైఖరి అవలంబించబోమని స్పష్టం చేశారు. చంద్ర నాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు నా దృష్టికి వచ్చాయి. డాలస్ (Dallas) లో మల్లయ్యకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య, కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. మా దేశానికి సంబందం లేని, క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు అని ట్రంప్ పేర్కొన్నారు.