Mukesh Ambani: న్యూయార్క్‌లో అత్యంత విలాసవంతమైన భవనం కొన్న ముకేశ్ అంబానీ

అమెరికా, న్యూయార్క్ (NewYork)లోని ట్రైబెకా ప్రాంతంలో రూ.153 కోట్ల (17.4 మిలియన్ డాలర్ల)తో విలాస భవనాన్ని రియలన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేశ్ అంబానీ(Mukesh Ambani ) కొనుగోలు చేశారని రియల్ డీల్ నివేదిక వెల్లడిరచింది. మన్‌హటన్ (Manhattan) ప్రాంతంలో 2023లో ఒక భవనాన్ని 9 మిలియన్ డాలర్లకు విక్రయించిన ముకేశ్, ఇప్పుడీ కొనుగోలు చేపట్టారు. ఉచిక్విటీ అనే టెక్ సంస్థ సీఎండీ అయిన రాబర్ట్ పెరా (Robert Pera) నుంచి ఈ భవంతిని ఆయన కొనుగోలు చేశారు. ఈ భవనాన్ని రాబర్ట్ 2018లో 20 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినా, ఇప్పుడు అంతకన్నా తక్కువకే విక్రయించడం గమనార్హం. ముకేశ్ సంపద విలువ 97.9 బిలియన్ డాలర్లు.