Acharya Devavrat: మహారాష్ట్ర గవర్నర్ గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర గవర్నర్ గా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ (Acharya Devavrat) ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ (Justice Chandrashekhar) ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కూడా హాజరయ్యారు. ఇటీవలే జరిగిన ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి వైదొలిగారు. ఆయన రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.