Ayyannapatrudu: వారు విద్యావంతులైతే వృద్ధి సాధించగలం : అయ్యన్నపాత్రుడు

మహిళలు ముందుకు వస్తేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) అన్నారు. తిరుపతి (Tirupati) లో నిర్వహించిన మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. మహిళలను విద్యావంతులను చేయాలని, వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలు కొత్త దిశను చూపిస్తాయన్నారు. మహిళలకు అన్ని రాష్ట్రాల్లో సమాన హక్కులు కల్పించాలి. విద్య (Education) ఉపాధి అవకాశాలు అందించాలి. వారు విద్యావంతులైతే వృద్ధి (Growth) సాధించగలం. ఏటా ఇలాంటి సమావేశాలు జరగాలని కోరుకుంటున్నాను. 3 ఏళ్లలో ఏపీకి రాజధాని సిద్ధం అవుతుంది. అప్పుడు అమరావతి (Amaravati) లోనూ ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఇవ్వాలి. అందరం కలిసి నడిస్తేనే మహిళ సాధికారత కార్యరూపం దాలుస్తుంది అని తెలిపారు.