Elon Musk: ఎలాన్ మస్క్ మరో ఘనత!
ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk) మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతున్నారు. టెస్లా (Tesla) సీఈవోకు ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు అంగీకరించారు. దీంతో త్వరలోనే ప్రపంచం (World)లో తొలి ట్రిలియనీర్‌గా మస్క్ చరిత్ర సృష్టించే అవకాశాలు కన్పిస్తున్నాయి. టెస్లా కంపెనీ వార్షిక సమావేశం జరిగింది. ఈ క్రమంలో మస్క్‌కు భారీ ప్యాకేజీ ఇచ్చేందుకు 75 శాతం మందికి పైగా షేర్ హోల్డర్స్ (Shareholders) అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్యాకేజీ ప్రకటన వెలువడిన అనంతరం మస్క్ ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో మస్క్ మాట్లాడుతూ తనకు మద్దతుగా ఓట్లు వేసిన వాటాదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ ప్రకటన నేపథ్యంలో టెస్లా షేర్లు పెరిగినట్లు తెలిసింది.







