Kaivalya Reddy: వ్యోమగామి శిక్షణకు కైవల్యరెడ్డి ఎంపిక
ప్లోరిడాలోని టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో చేపట్టే వ్యోమగామి (Astronaut) శిక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్యరెడ్డి (Kaivalya Reddy) అర్హత సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి వేల మంది దరఖాస్తు చేయగా వడపోత అనంతరం 150 మందిని శిక్షణకు ఎంపిక చేశారు. ఆ జాబితాలో కైవల్య ఉన్నారు. ఈ సంస్థ సీఈఓ నీల్ ఎస్. లాచ్మన్ (Neil S. Lachman) నుంచి ఈమెయిల్ సమాచారం అందడంతో ఆమెతోపాటు కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు అంతరిక్షం తదితర అంశాలపై ఆసక్తి పెంచుకుని రసాయన, భౌతిక (Physical), గణిత శాస్త్రలపై పట్టు సాధించి లక్ష్యం దిశగా పయనిస్తూ 17 ఏళ్లకే అవకాశాన్ని కైవల్య సొంతం చేసుకున్నారు. 2026 ఉంచి 29 వరకు శిక్షణ ఉంటుంది.







