Chandrababu :సీఎం చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) , బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ (Madhukar) సచివాలయంలో భేటీ అయ్యారు. బిర్సా ముండా 150 ఏళ్ల జయంతి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరపనున్న నేపథ్యంలో ఎన్డీయే నేతలను ఆహ్వానించడానికి కార్యచరణ రూపొందించామని చంద్రబాబుకు మాదవ్ వివరించారు. వందేమాతరం గీతం 150 వసంతాల వేడుకలు, వాజ్‌పేయీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి కార్యక్రమాల గురించి వివరించారు. ఇంటింటికీ స్వదేశీ, ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్, మన్‌కీ బాత్ కార్యక్రమాలను ఎన్డీయే ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకారం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వదేశీ స్టిక్కరు, మన్‌కీ బాత్‌పై ప్రచురించిన పుస్తకాన్ని మాధవ్ బహుకరించారు.







