Bandi Sanjay: బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతిపై ..ఎందుకు విచారణ అడగడం లేదు?
బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ (CBI) విచారణ జరిపిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేవలం రూ.9 వేల కోట్ల పైనే విచారణ కోరుతూ కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) నిలదీవారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎంపీ డీకే అరుణ తదితర నేతలతో కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. బోరబండ (Borabanda)లో రోడ్ షో నిర్వహించి ప్రసంగించారు. ఎవరిని కాపాడేందుకు రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ అడగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, జూబ్లీహిల్స్ ఎన్నికలో ప్రజలిచ్చే తీర్పు ఆ పార్టీలకు కనువిప్పు కావాలని అన్నారు. హైదరాబాద్లో అంతోఇంతో అభివృద్ధి జరగుతోందంటే అది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్లే. ఈ అంశాన్ని నిరూపించడానికి, లెక్కా పత్రంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు.







