అప్పుడే హెచ్చరికలు… అంతలోనే బాంబుల మోత
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు మెరుపుదాడికి దిగాయి. స్థానిక ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఐడీఎఫ్ తుపాకుల మోత మోగించింది. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిరచారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. 50 మందికి పైగా సామాన్య ప్రజలకు గాయాలైనట్లు పేర్కొన్నారు. ఖాన్ యూనిస్ నగరాన్ని ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సోమవారమే ఆదేశించింది. అంతలోనే దాడులకు పాల్పడటం గమనార్హం.






