same-sex marriage: స్వలింగ వివాహాలకు మరో దేశం గ్రీన్ సిగ్నల్…!
ఆగ్నేయాసియాలో స్వలింగ జంటల వివాహాలను గుర్తించిన మొదటి దేశంగా థాయ్‌లాండ్ (Thailand) నిలిచింది. గత సంవత్సరం ఆ దేశ పార్లమెంటు ఆమోదించిన దేశ వివాహ సమానత్వ బిల్లు.. జనవరి 22 నుండి అమల్లోకి వచ్చింది. 2023లో థాయిలాండ్‌కు తిరిగి రాకముందే యునైటెడ్ స్టేట్స్ (US) లో వివాహం చేసుకున్న అమెరికన్ వ్యాపారవేత్త జాకబ్ హోల్డర్, అతని థాయ్ భర్త సురపాంగ్ కూన్పేవ్.. దాంపత్యం ఆ దేశంలో సంచలనం అయింది. వారికి చట్టబద్దత లభిస్తుందా లేదా అనే దానిపై దేశ వ్యాప్తంగా ఉత్కంట నెలకొంది.
వారి వివాహమైన వెంటనే, ఈ జంటకు కొలంబియాలో చట్టపరంగా… అద్దె గర్భం ద్వారా ఎలిజా బిప్రిన్ హోల్డర్ కూన్పేవ్ అనే కుమారుడు జన్మించాడు. థాయ్‌లాండ్‌లో స్వలింగ జంటల చట్టబద్దత లేకపోవడమే కాకుండా అద్దె గర్భం ద్వారా పిల్లలను కనే హక్కు కూడా లేదు. యుఎస్ జనన ధృవీకరణ పత్రంలో ఎలిజా బిప్రిన్ కు తన తల్లిదండ్రుల ఇద్దరి పేర్లు వచ్చాయి. అయితే 18 నెలల వయస్సు గల ఆ చిన్నారి.. తప్పని పరిస్థితుల్లో అతను టూరిస్ట్ వీసాపై థాయిలాండ్ లో తల్లి తండ్రుల వద్ద ఉంటున్నాడు.
థాయ్‌లాండ్ కొత్త వివాహ సమానత్వ బిల్లు ఇప్పుడు స్వలింగ జంటలు బిడ్డను దత్తత తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. జాకబ్, సురపాంగ్ త్వరలో మరో బిడ్డను కనాలని ప్లాన్ చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించడానికి థాయిలాండ్ మంచి దేశం అని అభిప్రాయపడుతున్నా ఆ జంటలు కొలంబియా వెళ్లి అద్దె గర్భం ద్వారా మరో బిడ్డను కనే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సమానత్వ చట్టం ఆమోదించినప్పటికీ.. కుటుంబానికి థాయిలాండ్ యొక్క సాంప్రదాయ నిర్వచనం ప్రకారం.. తండ్రి పురుషుడుగా తల్లి ఒక స్త్రీగా మాత్రమే పత్రాల్లో చూపించాల్సి ఉంటుంది.






