Blue Diamond: వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్
దేశ రాచరిక వారసత్వ సంపద, చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ (Blue Diamond) వేలానికి రానుంది. ఇందౌర్, బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన, ప్రపంచంలోనే అరుదైన ఈ నీలి రంగు వజ్రాన్ని మే 14న జెనీవా (Geneva)లో క్రిస్టీస్ సంస్థ వేలం వేయనుంది. 23.24 క్యారెట్ల ఈ వజ్రం ధర రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్ల వరకు పలకొచ్చని భావిస్తున్నారు. ఈ వజ్రానికి 259 సంవత్సరాల చరిత్ర ఉంది. తొలుత ఇందౌర్ రాజవంశ వైభవానికి నిదర్శంగా నిలిచిన దీన్ని 1947లో న్యూయార్క్ (New York)కు చెందిన నగర వ్యాపారి హ్యారీ విన్స్టన్ (Harry Winston) కొనుగోలు చేశారు. ఈ వజ్రం బరోడా మహారాజు వద్దకు చేరింది. అనంతరం ఓ ప్రైవేట్ సంస్థ దీనిని సొంతం చేసుకుంది.







