America : అమెరికాతో తాలిబన్ ప్రభుత్వం డీల్
అమెరికా, తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గానిస్థాన్ మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం కుదిరినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఇందులో భాగంగా అమెరికా (America)లో ఖైదీగా ఉన్న అఫ్గాన్‌కు చెందిన ఖాన్ మహమ్మద్ (Khan Mohammed )ను విడిపించుకోవడానికి ఇద్దరు అమెరికా ఖైదీలను తాలిబన్ (Taliban )ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఒప్పందానికి ఖతార్ (Qatar) మధ్యవర్తిత్వం వహించింది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన ఖాన్ మహమ్మద్ 2008 నుంచి కాలిఫోర్నియా(California)లోని జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారడు. ఈ నేపథ్యంలో అతడిని విడిపించుకోవడానికి తమ వద్దనున్న ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేయనున్నట్లు అఫ్గాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం అనంతరం ఈ ఒప్పందం కుదరడం గమనార్హం.






