Tahawwur Rana: తహవ్వుర్ రాణా కు మరోసారి చుక్కెదురు
ముంబై ఉగ్ర దాడుల నిందితుడు తహవ్వుర్ రాణా (Tahawwur Rana) ( 64)కు మరోసారి చుక్కెదురైంది. తనను భారత్‌కు పంపొద్దంటూ అతను పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు (US Supreme Court) తిరస్కరించింది. న్యూయార్క్‌లోని భారత సంతతికి చెందిన అటార్నీ రవీ బత్రా (Ravi Batra) ఈ మేరకు వెల్లడిరచారు. ముంబై దాడుల (Mumbai attacks )కు తెగబడ్డ పాకిస్థానీ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాకు సాయపడటమే గాక డెన్మార్క్‌లో ఉగ్ర దాడికి అన్నివిధాలా మద్దతిచ్చారంటూ రాణాపై అమెరికా (America)లో దాఖలైన అభియోగాలు ఇప్పటికే రుజువయ్యాయి. ప్రస్తుతం అతను లాస్ ఏంజెలెస్‌లోని మెట్రో పాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఖైదీగా ఉన్నాడు. రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టులు ఇప్పటికే అనుమతించాయి. కోర్టు విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని త్వరలో భారత్ పంపనున్నట్లు ట్రంప్ కూడా వెల్లడించారు.







