Sunita Williams: డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ ధన్యవాదాలు
రోదసిలో చిక్కుకుపోయిన భారత సంతతి సునీతా విలియమ్స్ (Sunita Williams) , బుచ్ విల్మోర్ (Butch Wilmore )తో సహా మరో ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వీరి రాకపై స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్ నకు కృతజ్ఞతలు తెలిపారు. ఐఎస్ఎస్ (ISS)లో చిక్కుకున్న వ్యోమగాములను భూమి పైకి తీసుకొచ్చేందుకు బైడెన్ (Biden) ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని మస్క్ అనేకసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వారిని తిరిగి తీసుకురావాలని అధ్యక్షుడు ట్రంప్ స్పేస్ఎక్స్ని కోరారని వెల్లడించారు. తాజాగా వారు తిరిగిరావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిన స్పేస్ఎక్స్, నాసా బృందాలకు మస్క్ అభినందనలు తెలిపారు.






