Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పౌర పురస్కారం
శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అందుకొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార డిసనాయక ఆ ఆవార్డులో మోదీని సన్మానించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ కీలక పాత్ర పోషించినట్లు శ్రీలంక అధ్యక్షుడు తెలిపారు. శ్రీలంక (Sri Lanka )లో అత్యున్నత పౌర పురస్కారం అయిన మిత్ర విభూషణ్ అవార్డు (Mitra Vibhushan Award) ను 2008లో ప్రారంభించారు. ఆ నాటి అధ్యక్షుడు మహింద రాజపక్స (Mahinda Rajapaksa) ఈ అవార్డును నెలకొల్పారు. గతంలో మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్, పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ (Yasser Arafat) అందుకున్నారు. లంక అధ్యక్షుడు దిసనాయకే తనకు మిత్ర విభూషణ్ అవార్డును అందజేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు కూడా గర్వకారణమన్నారు.







