America : మంచు దుప్పటిలో అమెరికా .. టెక్సాస్ లో పాఠశాలల మూసివేత
అమెరికాలో మరోసారి మంచు (Snow) విరుచుకుపడిరది. గతంలో తూర్పు ప్రాంతాన్ని వణికించిన మంచు తుపాను ఇప్పుడు దక్షిణాదిపై పడిరది. తీవ్రమైన మంచుతోపాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు నెలకొనడంతో టెక్సాస్ (Texas) లోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. గురువారం ఉదయం డాలస్ (Dallas)లో వందల విమానాలు రద్దయ్యాయి. 10 లక్షల మంది విద్యార్థులను శుక్రవారం వరకు పాఠశాలలకు పంపవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పున ఉన్న కన్సాస్, ఆర్కాన్సాస్, వర్జీనియాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. డాలస్లో 2 నుంచి 4 అంగుళాల మంచు పేరుకుపోయింది.






