Snowstorm :అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్
అమెరికాలోని మధ్య, దక్షిణాది రాష్ట్రాల నుంచి తూర్పు తీరం వరకు తీవ్రమైన మంచు తుఫాను, రక్తం గడ్డ కట్టే చలి జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. రోడ్ల (Roads) పై మంచు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ప్రయాణించా లంటే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు(Government offices), పాఠశాల (School)లను మూసివేశారు. కెంటకీ, ఇండియానా, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, ఇలినాయిస్, మిస్సోరీ లలో సుమారు 3 లక్షల మంది విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.






