Saudi Arabia: భారత్ సహా 14 దేశాలపై సౌదీ వీసా నిషేధం
సౌదీ అరేబియా (Saudi Arabia) తన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులపై కొరడా ఝుళిపించింది. హజ్ యాత్ర (Haj Yatra) త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ (India)తోపాటు 14 దేశాల ముస్లిం పౌరులకు వీసాలపై జారీపై నిషేధం విధించింది. ఆ జాబితాలో దాయాది పాకిస్థాన్ (Pakistan) తోపాటు మొరాకో, నైజీరియా, అల్జీరియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా (Indonesia), ఇరాక్, జోర్డాన్, సుడాన్, ట్యునీషియా, యెమెన్ ఉన్నాయి. వీరు తమ దేశాల కోటాతో సంబంధం లేకుండా అనధికారికంగా హజ్‌యాత్రలో పాల్గొనడంతోపాటు వీసా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ కాలం బస చేస్తున్నారని సౌదీ ఆందోళన వ్యక్తం చేసింది.







