భారతీయుల కోసం బహుళ వీసాలు : సౌదీ
భారతీయుల కోసం బహుళ వీసా అవకాశాలను సౌదీ ప్రకటించింది. స్టాఫ్ఓవర్ వీసా, ఇ-వీసా, వీసా ఆన్ అరైవల్ ఇప్పుడు భారతీయ పౌరులకు అందుబాటులో ఉన్నాయి. సౌదీ ఈ సంవత్సరం భారతీయ పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేయడం ద్వారా 2.2 మిలియన్ల మార్క్‌ను చేరుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. అలాగే 2030 నాటికి 7.5 మిలియన్ల మంది భారతీయ పర్యాటకులను చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం హైదాదరాబాద్, ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో, కోల్‌కతా, కాలికట్ లలో 10 వీసా ఫెసిలిటేషన్ కేంద్రాలు ఉన్నాయి. అదనపు నగరాల్లో మరిన్ని ప్రత్యేక కేంద్రాలను జోడిరచే యోచనలో సౌదీ ఉంది.






