Sanju Samson: నా కొడుకుపై కుట్రలు చేస్తున్నారు: సంజు తండ్రి
విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు నుంచి సంజు సామ్సన్ (Sanju Samson) ను తప్పించిన నేపథ్యంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ పై సంజు తండ్రి తీవ్ర ఆరోపణలు చేసారు. తన కుమారుడిపై కేసియే (KCA) కుట్ర పన్నిందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఆరోపించారు . శాంసన్… ట్రైనింగ్ శిబిరానికి కచ్చితంగా హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరు కావడంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. ఇక అక్కడి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శాంసన్, కేసియే మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి.
ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా సామ్సన్ ను తప్పించారు. దీనితో కేసియే అధ్యక్షుడు జయేష్ జార్జ్ ను విమర్శించాడు. అయితే జయేష్ కూడా దీనిపై ఘాటుగానే సమాధానం ఇచ్చారు. కేవలం సింగిల్ లైన్ మెసేజ్ తో అతను ట్రైనింగ్ క్యాంప్ కు హాజరు కాలేదని వివరణ ఇచ్చాడు. ఈ పరిణామాల తర్వాత సంజూ శాంసన్ తండ్రి అసోసియేషన్‌పై కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది తన కుమారుడి ప్రతిష్టను దిగజార్చిందని ఆరోపించారు. వారు ఏదైనా తప్పు చేసినా… సంజును బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు.
తన కుమారుడికి ఆడేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ విశ్వనాథ్.. ఇతర రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లను విజ్ఞప్తి చేసారు. సంజుకు వ్యతిరేకంగా వాళ్లు ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు ఆరు నెలల క్రితమే తెలుసు అంటూ విశ్వనాథ్ సంచలన ఆరోపణలు చేసారు. అతను కేరళను విడిచిపెట్టి వెళ్లిపోయే విధంగా కేసియే కుట్రలు చేస్తుందని… వాళ్లతో గొడవ పడలేకపోయామన్నారు. తన కొడుకు క్రికెట్ అసోసియేషన్ లో సేఫ్ గా లేడు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. మేము ఏ తప్పు చేయలేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.






