Russia :విరామం అంటూనే విరుచుకుపడింది
అగ్రరాజ్యం అమెరికా (America) ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు తలూపిన రష్యా చిట్టచివర్లో తల ఎగరేసింది. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్ (Ukraine )ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రపాత్ర అంగీకారానికి సిద్ధపడిన రష్యా (Russia) వెనువెంటనే సమర నినాదం చేసింది. మంగళవారం రాత్రి నుంచి నిరాటంకంగా రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)తో దాదాపు గంటకు పైగా ఫోన్లో సంభాషించిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం.






