భారత్ ఎన్నికల్లో అమెరికా జోక్యం… రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు తమ దేశంలో కుట్ర జరిగిందంటూ, దానివెనుక భారత వ్యక్తుల ప్రేమయం ఉందంటూ అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను తాజాగా రష్యా తోసిపుచ్చింది. వాటికి ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదని తెలిపింది. ఇక, భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. భారత్లో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలన్న ఉద్దేశంతో అక్కడి అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపర్చాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా మారియా వ్యాఖ్యానించారు. మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ ( యూఎస్సీఐఆర్ఎఫ్) నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని భారత్ తీవ్రంగా ఖండిరచింది.






