అమెరికన్ గ్యాంబిట్స్ జట్టుకు.. భారత క్రికెటర్
భారత సీనియర్ స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చెస్‌లో అడుగు పెట్టాడు. గ్లోబల్ చెస్ లీగ్‌లో ఈసారి కొత్తగా చేరిన అమెరికన్ గ్యాంబిట్స్ జట్టుకు అశ్విన్ సహ యజమానిగా ఉన్నాడు. గత ఏడాది పోటీపడిన చింగారీ గల్ఫ్ టైటాన్స్ జట్టు స్థానంలో కొత్తగా అమెరికన్ గ్యాంబిట్స్ జట్టు వచ్చింది. టెక్ మహీంద్రా, అంతర్జాతీయ చెస్ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది దుబాయ్‌లో తొలి గ్లోబల్ చెస్ లీగ్ జరిగింది. ఈ ఏడాది టోర్నీకి లండన్ నగరం వేదిక కానుంది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు ఆరు జట్టు మధ్య గ్లోబల్ చెస్ లీగ్ రెండో ఎడిషన్ జరగనుంది.






