Rahul Gandhi :అమెరికా చేరుకున్న రాహుల్ గాంధీ
లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) అమెరికా చేరుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఆయన రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయాన్ని(Brown University) సందర్శిస్తారు. అక్కడి విద్యార్థులు (Students), అధ్యాపకుల (Teachers)తో మాట్లాడతారు. ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. రాహుల్ గాంధీకి స్వాగతం. ఆయన యువజన వాణి వినిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం, ఉత్తమ భవిత కోసం గళమెత్తుతున్నారు. ఆయన చెప్పేది విని, నేర్చుకుని, కలిసి అడుగులు వేద్దాం అని భారతీయ ఓవర్సీస్ కాంగ్రెస్ అధిపతి శాం పిట్రోడా (Sam Pitroda) పేర్కొన్నారు. రాహుల్‌తో తాను సమావేశమై నైతికతతో కూడిన నాయకత్వం, ఆధునిక సాంకేతికత, సమ్మిళిత వృద్ధి వంటివాటిపై చర్చించినట్లు తెలిపారు.







