America : రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఖరారు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమెరికా పర్యటన (America tour )కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈ నెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యంటో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్ ఖేడా (Pawan Kheda) ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రాహుల్‌గాంధీ యూఎస్ లో పర్యటిస్తారని ఖేడా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీ (Brown University) ని సందర్శిస్తారన్నారు. ఆ వర్సిటీలోని విద్యార్థులు (Students), అధ్యాపకులతో మాట్లాడతారని తెలిపారు. దీనికి ముందు ఆయన ఎన్నారై సంఘ సభ్యులతో పాటు ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతోనూ సమావేశమవుతారని వెల్లడిరచారు.







