రిషి సునాక్ పై రాహుల్ గాంధీ ప్రశంసలు
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం, వాటిని హుందాగా స్వీకరించాలి అంటూ బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఇటీవల బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వం వహిస్తున్న పార్టీ ఓటమి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రజల అభ్యున్నతికి ఎంతసేవ చేశారంటూ సునాక్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే భారత్` బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేసేందుకు రిషి సునాక్ చేసిన కృషిని తానెంతో గౌరవిస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో రిషి సునాక్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు.






