Putin: వచ్చే ఏడాది భారత్‌కు పుతిన్
తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనున్నారని రష్యా వెల్లడిరచింది. భారత్‌లో పర్యటించాలంటూ ప్రధాని మోదీ (Prime Minister Modi)పంపిన ఆహ్వానం తమకు అందిందని రష్యా అధ్యక్ష కార్యాలయం సహాయకుడు యూరీ యుషాకోవ్ (Yuri Yushakov) మీడియాకు వెల్లడిరచారు. పుతిన్ పర్యటనకు 2025 ప్రారంభంలో తేదీలు ఖరారు చేస్తామని తెలిపారు. ప్రతిఏటా ఒకసారి సమావేశం కావాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారని, ఇందులో భాగంగా ఈసారి పుతిన్ భారత్‌కు రానున్నారని ఆయన వెల్లడించారు.
రష్యాలోని కజన్‌లో ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్ (brics ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ భారత్‌లో పర్యటించాలని పుతిన్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అంతకుముందు జులైలో మోదీ రష్యాలో పర్యటించారు.






