Donald Trump :ట్రంప్‌తో మాట్లాడేందుకు పుతిన్ రెడీ : క్రెమ్లిన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తో సంభాషించేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ (Putin) సిద్ధంగా ఉన్నారని రష్యా వెల్లడిరచింది. అమెరికా నుంచి సమాధానం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపింది. అయితే, సమీప భవిష్యత్తులో అధినేతల మధ్య భేటీ ఉంటుందా? అన్న విషయంపై మాత్రం క్రెమ్లిన్ (Kremlin) స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్-పుతిన్‌ల మధ్య సంభాషణ ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్స్కీ (Zelensky) సైన్యానికి అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది.






