America: అమెరికాలో దారుణం.. యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవోను
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ ఇన్సూరెన్సు సంస్థ యునైటెడ్ హెల్త్ కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్ (Brian Thompson) న్యూయార్క్ నగరంలో హత్యకు గురయ్యారు. మిడ్టౌన్లోని హిల్టన్ హోటల్ బయట ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖానికి మాస్కుతో వచ్చిన దుండగుడు బ్రియాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అదే హోటల్లో ఇన్వెస్టర్ డే కాన్ఫరెన్స్ (Investor Day Conference ) లో బ్రియన్ పాల్గొనాల్సి ఉందని యునైటెడ్ హెల్త్ గ్రూప్ సీఈవో ఆండ్రూ విట్టీ పేర్కొన్నారు.






